వీరబ్రహ్మేంద్రస్వామి నీ దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ

by సూర్య | Thu, Nov 24, 2022, 12:02 PM

అనకాపల్లి తుమ్మపాల కొత్తపేట వీధి కంచరపేటలో గల శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో బుధవారం అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి సత్యవతి, డాక్టర్ విష్ణుమూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులును ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి వారిచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేందుకుగాను స్వామివారి రధాన్ని ఎంపీ దంపతులచే ప్రారంభించడం జరిగింది. తమ ఆహ్వానం మన్నించి వచ్చినందుకు ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పన్నీరు చంటి , బిఎస్ఎన్ఎల్ జిల్లా అడ్వైజరీ కమిటీ సభ్యులు పీలా విశ్వేశ్వరరావు , గారు, మత్తుర్తి మహేష్ గారు , కోసూరి బాబురావు వేణు గారు , ఆర్టీసీ సత్యనారాయణ అన్నపూర్ణ బ్యాంక్ చైర్మన్ పిల్ల గాంధీ , మాజీ వార్డ్ మెంబర్ కంకణాల ఆదిమూర్తి అధిక సంఖ్యలో మహిళలు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ Thu, Jun 08, 2023, 10:45 PM
వాయిదా పడిన సీఎం జగన్‌ గుడివాడ పర్యటన Thu, Jun 08, 2023, 10:08 PM
ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం Thu, Jun 08, 2023, 10:02 PM
నేడు సీఎం జగన్ ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు Thu, Jun 08, 2023, 09:26 PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8గా ఎంపీ అవినాష్ రెడ్డి Thu, Jun 08, 2023, 09:21 PM