అవినీతి ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు సబబు కాదు

by సూర్య | Thu, Nov 24, 2022, 11:09 AM

వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన అని, అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగడుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, తెలుగుయువత దండమూడి చౌదరి ఆరోపించారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులకు నిరసనగా ముదునూరులో బుధవారం తెలుగు యువత ఆధ్వర్యం లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పంథాలో శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ పెనమలూరు ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ని దర్శమని పార్టీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు దూసర అజయ్‌, కాటూరి శరత్‌, పామర్తి నాగరాజు, బూసే రవి, సజ్జా మధు, వెంకటనారాయణ, పాలడుగు మాధవి పాల్గొన్నారు.

Latest News

 
కోనసీమ జిల్లా నక్కిన వేధింపు రాయుడు..ఎట్టకేలకు అరెస్ట్ Sun, Nov 27, 2022, 11:55 AM
కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడి... ఖండించిన టీడీపీ నాయకత్వం Sun, Nov 27, 2022, 11:36 AM
మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉంది: మంత్రి గుడివాడ అమర్నాథ్ Sun, Nov 27, 2022, 11:35 AM
పిండ ప్రధానంకోసం నదిలోకి వెళ్లారు...మునుగి బయటపడ్డారు Sun, Nov 27, 2022, 11:35 AM
మూడు రాజధానులకు అందరి మద్దతు ఉంది : మంత్రి గుడివాడ అమర్‌నాథ్ Sun, Nov 27, 2022, 10:21 AM