![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 11:04 AM
మచిలీపట్నం జిల్లాలోని జగనన్న లేఅవుట్లలో మెరకపనులు, అప్రోచ్ రోడ్లనిర్మాణ పనులను ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... జగనన్న గృహాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గడప గడపకు మనప్రభుత్వం, వలంటీర్ల భర్తీ, తదితర అంశాలపై మండల అధికారులతో చర్చించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జగనన్న లేఅవుట్లలో మెరకపనులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. లేఅవుట్లలో పనులు చేసేందుకు నిధుల కొరత లేనప్పటికీ పనుల్లో పురగతి లేదని కలెక్టర్ అసహనం వ్యక్త చేశారు. వరుసగా మూడు వారాలపాటు పనుల్లో పురోగతిసాధించని ఏఈలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Latest News