విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌తో మహిళ మృతి, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం

by సూర్య | Thu, Nov 24, 2022, 11:02 AM

అనంతపురం నగరంలోని శారదానగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ మహిళ మృతి చెందింది. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్ళితే...  ... శారదానగర్‌ నాలుగో క్రాస్‌ సచివాలయం సమీపంలో మల్లికార్జున కుటుంబం నివాసముంటోంది. మల్లికార్జున స్వగ్రామం గోరంట్ల మండలం మందలపల్లి. ఇతను రెడ్డిపల్లిలోని వ్యవసాయశాఖ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ కింద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 20ఏళ్లుగా అనంతపురంలోనే నివాసముంటున్నారు. ఇతడికి భార్య అరుణ(35), నిత్య సాయి(10)ఫాల్గుణ(7) సంతానం. రాత్రి 7.30గంటల సమయంలో అందరూ ఇంట్లో ఉన్న సమయంలో కరెంట్‌ పోయి వచ్చింది. మీటర్‌ వద్ద షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో మంటలు రేగి పొగలు వ్యాపించాయి. అది గమనించిన మల్లికార్జున గట్టిగా అరుస్తూ బయటకు వచ్చాడు. తన ఇంట్లో విద్యుత షార్ట్‌సర్క్యూట్‌ అయిందని, భార్య, పిల్లలు లోపలే ఉన్నారని, కాపాడాలని కోరాడు. స్థానికులతో కలిసి మల్లికార్జున ఇంటి లోపలికి వెళ్లగా అరుణ, నిత్యసాయి, ఫాల్గుణ సొమ్మసిల్లి పడిపోయి కనిపించారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగానే అరుణ మృతి చెందింది. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అగ్నిమాపక శాఖాధికారులు ఫైరింజన సాయంతో మంటలను ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న వనటౌన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM