జగన్‌ అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్రంలో పాలన అస్తవ్య స్తంగా మారింది

by సూర్య | Thu, Nov 24, 2022, 11:00 AM

వైసీపీ నాయకుల అవినీతి దుశ్చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తో పాటు రాష్ట్రానికి చంద్రబాబు అవసరాన్ని ప్రజలకు తెలియ జెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అన్న కార్యక్రమంపై క్లస్టర్‌ యూనిట్‌ ఇన్‌చార్జిలతో బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్రంలో పాలన అస్తవ్య స్తంగా మారిందని దుయ్యబట్టారు. జగన్‌ కక్షపూరిత చర్యల వల్ల రాష్ట్రంలోని సామాన్య ప్రజానీకం స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. మూడు న్నరేళ్లలో అభివృద్ధి కన్నా ప్రశ్నించిన వారిపై పెట్టిన అక్రమ కేసులే ఎక్కువని ధ్వజమెత్తారు. పేదలు, రైతుల వ్యతిరేక పాలనపై ప్రజల్లో విస్తృతంగా తీసు కెళ్లడానికి డిసెంబరు 1వ తేదీ నుంచి ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లు, బూత్‌ కమిటీ ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, మండల కన్వీనర్లు బలరామిరెడ్డి, లా లెప్ప, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు ధనుంజయ, కేశవరెడ్డి, ఆనందరాజు, పొరాళ్లు పురు షోత్తమ్‌, ఇనాయత్‌ బాషా, కాలవ సన్నణ్ణ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా,,,,తిరుపతి నుంచి విజయవాడ వరకు జర్నీ Sat, Dec 02, 2023, 09:24 PM
ఏపీలో రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ Sat, Dec 02, 2023, 08:18 PM