ఆక్వా రైతులు కోసం టీడీపీ పోరు బాట

by సూర్య | Thu, Nov 24, 2022, 10:59 AM

తెలుగుదేశం పార్టీ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆక్వా రైతులకు కలుగుతున్న కష్టాలు, గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన వివిధ రకాల సబ్సిడీలను కొనసాగించాలన్న డిమాండ్లతో పోరు బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆక్వా రైతులకు భరోసా ఇచ్చేందుకు రానున్న ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపైన టీడీపీ అధిష్టాన వర్గం దృష్టి సారించింది. ఇందులో భాగంగా గురువారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ అఽధినేత చంద్రబాబు కోస్తా ప్రాంతంలోని ఆక్వా రైతులతో ముఖా ముఖి నిర్వహించనున్నారు. ఆక్వా రైతులతో భేటీపై ఇప్పటి కే చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమాయత్తం చేశారు. భేటీకి ఆయా నియోజకవర్గాల నుంచి ఆక్వా రైతులను తీసుకొచ్చే బాధ్యతను ఇన్‌చార్జ్‌లకే అప్పగించారు. ముఖాముఖి ఆక్వా రైతులతో మాట్లాడితే సమస్యలు మరిన్ని తెలుస్తాయన్నది చంద్రబాబు ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆక్వా రైతుల అభిప్రాయాలు, సమస్యల పరిష్కారానికి తీసుకోవా ల్సిన చర్యలపైన నివేదిక రూపొందించి ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చాలన్నది అధినేత అంతరంగంగా ఉంది. రాయితీలు వర్తింపచేయటంతోపాటు ఆక్వా జోన్లలో చెరువుల విస్తీర్ణా న్ని పూర్తిగా చేర్చేందుకు ఈ సమావేశంలో పార్టీ నిర్ణయా న్ని చంద్రబాబు బయట పెట్టనున్నట్లు తెలిసింది. విద్యుత్‌ ఛార్జీల రాయితీ చంద్రబాబు భేటీకి కైకలూరు నియోజక వర్గం నుంచి ఆక్వా రైతులు పార్టీ ఇన్‌చార్జ్‌ జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM