అద్దెకు తీసుకెళ్లి అమ్ముకోవడమే

by సూర్య | Thu, Nov 24, 2022, 10:53 AM

కార్లను అద్దెకు తీసుకెళ్లి, తిరిగి ఇవ్వకుండా కుదువ పెట్టడం లేదా విక్రయించి జల్సాలకు అలవాటుపడ్ట ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. మూడు కార్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు సంతపేట దుర్గానగర్‌కు చెందిన యుగంధర్‌, అతని అక్క మంజుల, భార్య అనిత జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. యుగంధర్‌ సంతపేట బొజ్జయ్యనాయుడు కాలనీకి చెందిన జనార్దన్‌, చవటపల్లెకు చెందిన ఢిల్లీ, గంగనపల్లెకు చెందిన ప్రసాద్‌కు సంబంధించిన కార్లను దొంగలించుకెళ్లాడు. పెనుమూరు మండలం చిన్న కలికిరికి చెందిన దిలీ్‌పకుమార్‌ వద్ద రెండు కార్లను అద్దెకు పెట్టి రూ.6 లక్షలు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వకుండా మాయమాటలు చెప్పి రెండు కార్లను అతనే తీసుకెళ్లిపోయాడు. బాధితులందరూ రెండు మూడు రోజుల వ్యవధిలో రెండో పట్ణణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ మల్లికార్జున్‌విచారణ చేపట్టారు. బుధవారం చిత్తూరు-పలమనేరు రోడ్డులోని కాజూరు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పలమనేరు వైపు నుంచి మారుతి సుజుకీ స్విప్ట్‌ డిజైర్‌లో వచ్చిన యుగంధర్‌ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిం చాడు. పోలీసులు చుట్టుముట్టి అతన్ని పట్టుకుని విచారిం చగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మూడు కార్లను యాదమరి క్రాస్‌వద్ద మెకానిక్‌ షెడ్డులో దాచి ఉంచినట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM