కీలక మార్పులు చేసిన వైసీపీ

by సూర్య | Thu, Nov 24, 2022, 10:50 AM

రీజనల్ కో ఆర్డినేటర్ నియామకంలో వైసీపీ మార్పులు చేసింది. కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా బొత్స సత్యనారాయణను నియమించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. ఉభయ గోదావరి జిల్లాలు, డా.అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డిలను నియమించింది.


కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పలనాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డిలను నియమించింది. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కర్నూల్, నంద్యాల జిల్లాలకు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిని నియమించింది. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించింది.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM