చిట్టి చేతులతో బాల శాస్త్రవేత్తలు అద్భుతాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 08:33 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని యర్రగుంటపల్లి జెడ్పీ పాఠశాలలో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్లూరు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వచ్చిన చిన్నచిన్న ఆలోచనలతో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు వరలక్ష్మి పర్యవేక్షణలో నమూనాలు తయారు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలలో నీటిని వృధా చేయకుండా పొదుపుగా నీటిని ఎలా వాడుకోవాలో సూక్ష్మ బిందువు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను క్షుణ్ణంగా విద్యార్థులు తెలియజేశారు. సౌరశక్తి ఉపయోగం వాటి వల్ల కలిగే ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరించారు. పిల్లలకు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గోన్నారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM