పనితీరే ప్రమాణికం..గూగుల్ పే తాజా నిర్ణయం

by సూర్య | Wed, Nov 23, 2022, 11:57 PM

గూగుల్ పే తాజాగా తన సిబ్బంది విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ఉద్యోగుల పనితీరును పరిగణనలోనికి తీసుకొని వారిని కొనసాగించే విషయంలో నిర్ణయంతీసుకోవాలని భావిస్తోంది. ఇధిలావుంటే అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించగా.. ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్ పీ సైతం 2025 మార్చి నాటికి 12 శాతం మేర ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మేరీ మయర్స్ ప్రకటించారు. తద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలన్నది కంపెనీ ప్రణాళికగా ఉంది. అమెరికా, యూరప్ లో ఆర్థిక మాంద్యం డిసెంబర్ చివరికి లేదంటే వచ్చే ఏడాది ఆరంభం నాటికి రావచ్చన్నది ఆర్థిక వేత్తల అంచనా. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీలు ముందు నుంచే ఉద్యోగులను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. 


12 శాతం అంటే సుమారు 6,000 మంది హెచ్ పీ ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. కంప్యూటర్ విక్రయాలు తగ్గిపోవడంతో సంస్థపై భారం పెరిగేలా చేసింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవడం కంపెనీకి ప్రాధాన్యంగా మారింది. మరోవైపు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. పనితీరు ఆధారిత మదింపులో భాగంగా సుమారు 10,000 మందిని గూగుల్ తొలగించనున్నట్టు తెలుస్తోంది. పనితీరు మదింపు సందర్భంగా తక్కువ స్కోర్ వచ్చిన వారిని రాజీనామా చేయాలని గూగుల్ కోరొచ్చన్నది తాజా కథనం. పనితీరులో బలహీనంగా ఉన్న 6 శాతం మంది లేదా సుమారు 10,000 మందిని షార్ట్ లిస్ట్ చేయాలని గూగుల్ తన మేనేజర్లను కోరినట్టు తెలుస్తోంది. 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM