ఇంటర్, డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాల భర్తీ

by సూర్య | Wed, Nov 23, 2022, 08:33 PM

భారతదేశ ఇన్సురెన్స్ దిగ్గజం ఎల్ఐసీ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇదిలావుంటే ఇంటర్, డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం సంపాదించాలని చూస్తున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) శుభవార్త చెప్పింది. పార్ట్ టైమ్ ఏజెంట్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఖాళీల భర్తీని చేపట్టేందుకు ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు విభాగాలలో రెండొందల ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఇంటర్, డిగ్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పార్ట్ టైమ్ ఏజెంట్ గా నియమితులైన వారికి రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు, ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు జీతంగా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.


ఉద్యోగ ఖాళీలు.. పార్ట్ టైమ్ ఏజెంట్: 100, పార్ట్ టైమ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్: 100


అర్హతలు:


పార్ట్ టైమ్ ఏజెంట్: 12వ తరగతి ఉత్తీర్ణత. పార్ట్ టైమ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ (బ్యాచిలర్స్ డిగ్రీ). 


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ 


దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు 2 డిసెంబర్ 2022 లోగా  www.ncs.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Latest News

 
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM