శరత్‌చంద్రారెడ్డి నాకు ఆత్మీయుడు

by సూర్య | Wed, Nov 23, 2022, 03:07 PM

శరత్‌ చంద్రారెడ్డి తనకు వ్యక్తిగతంగా ఆత్మీయుడని, గతంలో తాను కష్టాల్లో ఉన్నపుడు తనకు అండగా ఉన్న వ్యక్తి అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు తనకు చెడు చేసినవారు కూడా కష్టాల్లో ఉన్నారంటే పలకరించడం, పరామర్శించడం, సహాయపడటం తన అలవాటని వివరించారు. అది తన మనస్తత్వమని, ఆ విషయం అందరికీ తెలుసని స్పష్టం చేశారు. అలాంటిది తనకు వ్యక్తిగతంగా ఆత్మీయుడు అయిన శరత్‌చంద్రారెడ్డిని పలకరించకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. తాను చేసింది కరెక్టని తన మనస్సాక్షి చెబుతోందని, దాన్ని ఎవరైనా తప్పుపట్టినా, పలకరించడాన్ని కూడా రాజకీయం చేస్తామన్నా దాన్ని వారి విజ్ఞతకు, భగవంతుడికే వదిలివేస్తానని చెవిరెడ్డి పేర్కొన్నారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM