మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు కోరా: కొడాలి నాని

by సూర్య | Wed, Oct 05, 2022, 11:44 PM

ప్ర‌భుత్వం తీసుకున్న 3 రాజ‌ధానుల నిర్ణ‌యానికి అమ్మ‌వారి ఆశీస్సులు ఇవ్వాలంటూ మొక్కుకున్నాన‌ని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న 3 రాజ‌ధానుల నిర్ణయంపై కొడాలి నాని బుధ‌వారం మ‌రోమారు స్పందించారు. ద‌స‌రా ప‌ర్వ‌దినాన కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లం వేమ‌వరంలోని కొండాల‌మ్మ అమ్మ వారి ఆల‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌మ 


రెక్కాడితే గానీ డొక్కాడ‌ని ప‌రిస్థితుల్లో ఉన్న రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల కోస‌మే 3 రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకున్నామ‌ని నాని తెలిపారు. అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల‌తో పాటు దేవుళ్లు కూడా హ‌ర్షించ‌ర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోస‌మో కాకుండా... రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేయ‌రాద‌న్న భావ‌న‌తోనే సీఎం జ‌గ‌న్ 3 రాజ‌ధానుల నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు. రాష్ట్ర సంప‌ద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్‌ను కోల్పోయి అనాథ‌ల‌మ‌య్యామ‌న్న నాని... శ్ర‌మ అంతా అమ‌రావ‌తిపైనే పెడితే మ‌ళ్లీ అదే ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

Latest News

 
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM