ఉమ్మడి రాజధాని వదిలి ఎందుకొచ్చారో బాబు చెప్పాలి: మంత్రి కొట్టు సత్యనారాయణ

by సూర్య | Wed, Oct 05, 2022, 11:22 PM

ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలిపెట్టి ఎందుకు వచ్చారో చంద్రబాబు చెప్తే బాగుంటుందని  రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. దసరా పండుగ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదనిఆయన  అన్నారు. ఈ మేరకు టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సత్యనారాయణ మండిపడ్డారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయని.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని చెప్పారు.ఇక, దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు అసత్యాలు చెప్పారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క మాటనూ నిలబెట్టుకోలేదన్నారు. దుర్గమ్మ గుడికి రూ. 150 కోట్లు ఇచ్చానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. క్యూ కాంప్లెక్స్ ఒకటి కట్టి రూ. 150 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.


ఇక, మూడు రాజధానులపై మంత్రి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలిపెట్టి ఎందుకు వచ్చారో చంద్రబాబు చెప్తే బాగుంటుందన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు స్వార్థం వదిలిపెట్టి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలని సూచించారు. 2014లో తాను మారిపోయానని చంద్రబాబు చెప్పారని.. కానీ, అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు.  సీఎం జగన్ ఎక్కడ మాట తప్పారో చంద్రబాబు చెప్పాలని మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కాదని సీఎం జగన్ ఎక్కడ చెప్పారో బయటపెట్టాలన్నారు. రాజధాని అమరావతి కాబట్టే అక్కడ ఇల్లు కట్టుకున్నారని వివరించారు. అమరావతి వద్దు హైదరాబాద్ ముద్దు అంటోన్నది చంద్రబాబే అని దుయ్యబట్టారు. చంద్రబాబు కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఏర్పాటు చేయమంటే సాధ్యం కాదని తేల్చిచెప్పారు.


 

Latest News

 
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు Wed, Apr 24, 2024, 08:57 PM