నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

by సూర్య | Wed, Oct 05, 2022, 01:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన అందింది. కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  అలాగే, చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నిన్న కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ  మోస్తరు వర్షాలు కురిశాయి.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM