అభివృద్ధికి రూ. 50కోట్లతో ప్రణాళికలు

by సూర్య | Tue, Oct 04, 2022, 05:14 PM

గుంటూరు, మంగళగిరి: దుగ్గిరాల మండలం ఈమని గ్రామం గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమారు 30 కుటుంబాలు ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు సమక్షంలో తేదేపా పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. మంగళగిరి ఆటోనగర్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పార్టీలో చేరిన వారిని సాధరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను కప్పారు.


అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలు వెనుకబడిన తరగతుల వారు కాదు, మనందరికీ వెన్నెముక లాంటి వారు అని ఇప్పటికే సీఎం జగన్ రాష్ట్రంలో ఆయన పరిపాలన విధానంతో నిరూపించారని అన్నారు. దుగ్గిరాల మండలానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సుమారు రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులతో రానున్న రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 70 లక్షల నిధులతో గౌడ సామాజికవర్గ సోదరులకు ప్రత్యేకంగా సర్ధార్ గౌతు లచ్చన్న పేరుతో కమ్యూనిటీ హాలును నిర్మించామని ఎమ్మెల్యే ఆర్కే గుర్తుచేశారు.

Latest News

 
ఏటీఎం వ్యాన్ లో రూ.65 లక్షలు నగదు చోరీ Fri, Apr 19, 2024, 03:10 PM
అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలి Fri, Apr 19, 2024, 03:07 PM
80 కుటుంబాలు వైసిపి లో చేరిక Fri, Apr 19, 2024, 03:05 PM
పాఠశాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే! Fri, Apr 19, 2024, 03:03 PM
ఆర్ ఓ కార్యాలయం వద్ద బందోబస్తు Fri, Apr 19, 2024, 02:56 PM