సిద్ధవటం పెన్నా నదిలో కొట్టుకుపోయిన త్రాగునీటి పైపులైను

by సూర్య | Tue, Oct 04, 2022, 11:50 AM

కడప జిల్లా సిద్ధవటం పెన్నా లో లెవెల్ కాజ్వే పై ఉన్న త్రాగునీటి పైపులైను వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. 2014లో 1. 50 కోట్లతో పెన్నా నుంచి సిద్ధపటం ప్రజలకు త్రాగునీటి పథకాన్ని నిర్మించారు. వరద నీటి ఉధృతికి పైపులైను తరచూ కొట్టుకుపోతుంది. మూడు రోజుల కిందట పైపులైను మళ్ళీ కొట్టుకుపోవడంతో సిద్ధవటం ప్రజలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. శాశ్వతంగా నిలబడేలా పైపులైను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Latest News

 
నిష్పక్షపాతంగా లెక్కింపు చేపట్టాలి Sat, Apr 20, 2024, 01:57 PM
గుడివాడలో చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు Sat, Apr 20, 2024, 01:56 PM
యానాంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ Sat, Apr 20, 2024, 01:55 PM
చంద్రబాబుపై ఉన్న కేసుల వివరాలు ఇవిగో Sat, Apr 20, 2024, 01:55 PM
బొండా ఉమా పరిస్థితి ఏమిటి? Sat, Apr 20, 2024, 01:54 PM