ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా...?

by సూర్య | Fri, Sep 23, 2022, 04:47 PM

పోలీసుల తీరుపై మాజీమంత్రి పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా జైలులో ఐటీడీపీ ఉపాధ్యక్షుడు కట్టా లోకేష్‌ను సునీత  పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ శ్రేణులను కొట్టడానికి పోలీసులకు చేతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీస్ అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మెప్పు కోసం సీఐ విజయభాస్కర్ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సీఐ పద్ధతి మార్చుకోకపోతే ఆందోళనకు దిగుతామని పరిటాల సునీత హెచ్చరించారు. 

Latest News

 
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM
మహిళలు ఆర్థికంగా ఎదగాలి Fri, Sep 30, 2022, 02:14 PM
పొంగిన వాగు.. నిలిచిన రాకపోకలు Fri, Sep 30, 2022, 02:13 PM
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Sep 30, 2022, 02:11 PM