కుప్పం నియోజకవర్గానికి తోడుగా ఉంటా

by సూర్య | Fri, Sep 23, 2022, 04:32 PM

కుప్పం వేదికగా వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అక్షరాల 4,949 కోట్లును 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశారు. వారం రోజుల పాటు చేయూత ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజాప్రతినిధులంతా అక్కచెల్లెమ్మల సంతోషంలో భాగస్వాములు అవుతారని చెప్పారు. కుప్పంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ చేయూత బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ‘‘వెన్నుపోటుకు, దొంగఓట్లకు గత 30 ఏళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు. చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి తలవంచేది లేదని కుప్పం ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకుంటే అభివృద్ధి వైపు చూస్తే.. ఎలా ఉంటుందో.. 2019 ఎన్నికల తరువాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో చూపించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో చూపించారు. పంచాయతీ ఎన్నికల్లో చూపించారు. అన్నింటా.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి క్లీన్‌స్వీప్‌ ఇచ్చి.. జెండా ఎగురవేశారు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అన్ని విధాలుగా కుప్పం నియోజకవర్గానికి తోడుగా ఉంటా.. కుప్పం నియోజకవర్గం నా నియోజకవర్గంగా భావిస్తాను అని సీఎం అన్నారు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మీకు మంత్రిగా పంపిస్తానని కుప్పం ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM