“దిశ” మొబైల్ రెస్ట్ రూమ్ వాహనమును ప్రారంభించిన జిల్లా కలక్టర్

by సూర్య | Fri, Sep 23, 2022, 04:31 PM

పోలీసు శాఖలోని మహిళా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కొరకు రూ. 18.82 లక్షల విలువైన మొబైల్ రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పిOచిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోని మహిళల భద్రతే ధ్యేయంగా ప్రారంభించిన “దిశ”  కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల పోలీసు ల కు అనేక వాహనాలు కేటాయించడం జరిగింది.అందులో భాగంగా గౌరవ రాష్ట్ర DGP శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి , కాకినాడ జిల్లా పోలీసు శాఖకు ఒక దిశ మొబైల్ రెస్ట్ రూమ్ వాహనము కేటాయించడం జరిగింది. ఈ వాహనము విలువ రూ.18,81,882-00 లు.


ఈవాహనంలో సౌకర్యాలు విద్యుత్ ద్వారా మరియు జనరేటర్ ద్వారా పనిచేసే సదుపాయం ఉంది.  ఇతర ప్రాంతాలకు బందోబస్తు  విధులకు వెళ్ళిన పోలీసు శాఖలోని మహిళా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అవసరాల నిమిత్తం ఈ వాహనంఉపయోగపడుతుంది. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మరియు కాకినాడ ఎం.పి. శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గార్లు ఈ వాహనం ను ఈరోజు ప్రారంభించారు. 

Latest News

 
ఐటీ చూపు విశాఖ వైపు Fri, Sep 30, 2022, 03:30 PM
గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ Fri, Sep 30, 2022, 03:26 PM
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM