మహిళలందరూ సీఎం వైయస్‌ జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

by సూర్య | Fri, Sep 23, 2022, 04:30 PM

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 16 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తనను 30 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు చేసిందేమీ లేదని, చివరకు కుప్పంను మున్సిపాలిటీగా కూడా చేసుకోలేకపోయాడని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ చేయూత పథకంలో భాగంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.  'కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది. అభివృద్ధి ఎలా ఉందో కుప్పం ప్రజలే ఆలోచన చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా చంద్రబాబు కుప్పం ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకువచ్చాడో ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏ రాష్ట్రంలో ఎవరూ, ఎప్పుడూ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల సాయం  డీబీటీ ద్వారా, నాన్‌ డీబీటీ ద్వారా 5 కోట్ల 30 లక్షల ఒక వెయ్యి 22 మందికి ఇప్పటి వరకు లబ్ధి చేకూర్చారు. మహిళలందరూ సీఎం వైయస్‌ జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు డైరెక్టర్‌గా బటన్‌ నొక్కి 23 సంక్షేమ పథకాల ద్వారా సాయం అందించారు. నాన్‌ డీబీటీ కింద 6, మొత్తం కలిసి 29 పథకాలను ప్రారంభించారు అని తెలియజేసారు. 

Latest News

 
విద్యార్థులకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్ Fri, Sep 30, 2022, 02:09 PM
వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ Fri, Sep 30, 2022, 02:04 PM
పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమీషనర్ Fri, Sep 30, 2022, 01:56 PM
ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే ధ్యేయం: ఏమ్మెల్యే జొన్నలగడ్డ Fri, Sep 30, 2022, 01:55 PM
పేర్లు మార్చటం రంగులు వేయడంతోనే అభివృద్దా: తోట Fri, Sep 30, 2022, 01:53 PM