![]() |
![]() |
by సూర్య | Fri, Sep 23, 2022, 04:23 PM
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం నాతవరం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు లాలం వెంకట రమణారావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా పోరు యాత్ర ప్రారంభించారు. గునుపూడి నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడిగర్ల సతీష్, బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చదరం నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు తమరాన ఎర్రన్నాయుడు, పట్టణ అధ్యక్షులు వెలగా జగన్నాథం, నర్సీపట్నం మండల అధ్యక్షులు బోళెం శివ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గవిరెడ్డి త్రినాథ్, బీజేవైఎం కార్యదర్శి గండేపల్లి మురళీకృష్ణ, చింతకాయల చిట్టిబాబు, పేరూరు రాయుడు తదితరులు పాల్గొన్నారు.
Latest News