భార్యపై భర్త దాడి.. కేసు నమోదు

by సూర్య | Fri, Sep 23, 2022, 02:25 PM

భార్యపై దాడికి పాల్పడిన భర్త పై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదయింది. పోలీసులు కథనం ప్రకారం జేకేసీ నగర్ కు చెందిన స్వర్ణకి పట్టాభిపురానికి చెందిన శివ జవహర్ తో 2015 లో వివాహమయ్యింది. భర్త ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొంతకాలంగా స్వర్ణ పుట్టింటిలో ఉంటున్నారు. ఇటీవల గుంటూరు వచ్చిన భర్త స్వర్ణను కాపురానికి తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆమెపై దాడి చేసి సెల్ ఫోన్ పగలగొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM