కుప్పంను పులివెందులగా భావిస్తాను.

by సూర్య | Fri, Sep 23, 2022, 01:54 PM

పులివెందులలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో.. అదే విధంగా కుప్పంను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు అని ఎమ్మెల్సీ భరత్‌ తెలిపారు. వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని కుప్పం వేదికగా సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. ఈ మేరకు కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడారు. కుప్పం 175వ నియోజకవర్గం. రాష్ట్రంలో కూడా చివర మారుమూల ఉన్న ప్రాంతం. మూడు రాష్ట్రాల సరిహద్దులో కుప్పం ఉంటుంది. కుప్పాన్ని ఇన్నిరోజులు ప్రజలను మోసం చేస్తూ, బెదిరించి ఓట్లు వేసుకొని గెలుస్తున్న పార్టీలకు, ఎమ్మెల్యే చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. కుప్పం నియోజకవర్గానికి సీఎం ఏం చేశారని అడుగుతున్నారు.. కుప్పం నియోజకవర్గానికి 33 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిని.. ఇల్లు కట్టుకునే విధంగా సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్నారు. కుప్పం మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు తాగునీరు, సాగునీటి వసతి కల్పించలేదు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎలాగూ సీఎం పూర్తిచేస్తారు కాబట్టి.. సాగు, తాగునీటి కోసం ఒక రిజర్వాయర్‌ కట్టించి.. పాలరు ప్రాజెక్టును పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కోరుతున్నాను. మహిళల కోసం వైయస్‌ఆర్‌ చేయూత అనే కార్యక్రమాన్ని కుప్పంలో ప్రారంభించేందుకు వచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు’ తెలిపారు. 

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM