ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

by సూర్య | Fri, Sep 23, 2022, 01:34 PM

వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు అయింది. గతంలో విధించిన రిమాండ్ గడువు పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు అక్టోబర్ 7 వరకు రిమాండ్ పొడిగించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ కారు డ్రైవర్ హత్య కేసులో మే 23 నుంచి అనంతబాబు జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో అంత్యక్రియల కోసం బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Latest News

 
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM