ఇది కుప్పమా.. పులివెందులా అన్నట్టుగా ఉంది

by సూర్య | Fri, Sep 23, 2022, 11:32 AM

కుప్పం వేదికగా వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని మూడో ఏడాది సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేయనున్నారు. కుప్పంలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు కుప్పం పట్టణం రంగు మారింది.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎగిరే జెండా రంగు మారుతుంది’ అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.  కుప్పం ప్రజలు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, ఇది కుప్పమా.. పులివెందులా అన్నట్టుగా ఉందన్నారు. 30 ఏళ్లలో చంద్రబాబు చేయనిది.. సీఎం వైయస్‌ జగన్‌ మూడేళ్లలో చేసి చూపించారని చెప్పారు. ఇప్పుడు కుప్పం పట్టణం రంగు మారింది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎగిరే జెండా రంగు మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నుంచి కురుపాం వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎగిరేది వైయస్‌ఆర్‌ సీపీ జెండానే అన్నారు. వైయస్‌ఆర్‌ చేయూతతో మహిళల జీవితాల్లో సీఎం వైయస్‌ జగన్‌ వెలుగులు నింపారన్నారు.  చంద్రబాబు, లోకేష్‌ వీధి వీధి తిరిగినా కుప్పం ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా టీడీపీని ఓడించారని మంత్రి ఆర్కే రోజా గుర్తుచేశారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM