ఉద్ధవ్ థాకరేతో అదానీ భేటీ...రాజకీయాలు మారనున్నాయా

by సూర్య | Thu, Sep 22, 2022, 10:39 PM

మహారాష్ట్రలో మళ్లీ ఊహించని రాజకీయాలు చోటుచేసుకోనున్నాయా...? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రపంచ శ్రీమంతుల్లో రెండో స్థానంలో ఉన్న వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. 


మరోవైపు, శివసేనను చీల్చి... ఆ పార్టీ రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో, థాకరేతో అదానీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. థాకరేతో అదానీ సమావేశమైన విషయాన్ని అదానీ గ్రూప్ కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే, వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM