మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం: గౌరీ ఖాన్

by సూర్య | Thu, Sep 22, 2022, 10:37 PM

తన కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ సమయంలో  మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాంను అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్  పేర్కొన్నారు. ఇదిలావుంటే గత ఏడాది ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేక కోర్టు విచారణలు, డ్రామాలు, 26 రోజుల కస్టడీ తర్వాత బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి మీడియాలో ఎంతగా వచ్చినా షారూక్ కుటుంబంలో ఎవ్వరూ స్పందించలేదు. తాజాగా షారూక్ భార్య గౌరీ ఖాన్ ఇప్పుడు తన కుమారుడి అరెస్టుపై ఎట్టకేలకు పెదవి విప్పారు.. కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ లో భావనా పాండే, మహీప్ కపూర్‌లతో పాల్గొన్న ఆమె ఈ కేసు గురించి మాట్లాడారు. 


ఈ షో హోస్ట్ కరణ్ ఈ వివాదాస్పద కేసు గురించి గౌరీ ఖాన్‌తో మాట్లాడారు. ‘ఇది అతనికి చాలా కఠినమైన ప్రయాణం. ఈ కష్ట సమయంలో మీరంతా చాలా బలంగా నిలబడ్డారు. ఒక తల్లిగా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు. ఈ  పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. మనదంతా ఒకే కుటుంబం. దీని తర్వాత మీరు గతంలో కంటే బలంగా తయారయ్యారు’ అని గౌరీతో కరణ్ చెప్పారు. 


దీనికి స్పందిస్తూ  గౌరీ తొలిసారి ఆర్యన్ ఖాన్ అరెస్ట్ గురించి మాట్లాడింది. ‘మనం అనుభవించిన దాని కంటే దారుణమైన పరిస్థితి మరోటి ఉండదు. ఈ కష్ట సమయంలో మనమంతా ఒక కుటుంబంలా నిలబడి ఉన్నాము. మాకు ఎంతో ప్రేమ లభించింది. మాకు తెలియని వాళ్ల నుంచి కూడా సందేశాలు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే మనం గొప్ప ప్రదేశంలో ఉన్నామని నేను చెప్పగలను. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం’ అని గౌరీ చెప్పుకొచ్చారు.


 


 

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM