ముగ్గరు కలిసుండేందుకు నిర్ణయం తీసుకొన్నారు..సినిమా తరహాలో సాగిన పెళ్లి

by సూర్య | Thu, Sep 22, 2022, 10:11 PM

ఏ స్త్రీ అయిన తన భర్తను కలలో కూడా పరాయి స్త్రీతో పంచుకోవడానికి ఇష్టపడదు. కానీ  కొన్ని సందర్భాలలో మనకు సినిమా సీన్లు కూడా నిజజీవితంలో ఇటీవల కనిపిస్తున్నాయి. అచ్చం సినిమాను తలపించే ఓ ఘటన తిరుపతిలో చోటు చేసుకొంది. భర్తకు ఆయన ప్రియురాలితో భార్య పెళ్లి జరిపించిన ఘటన తిరుపతిలో జరిగింది. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  వివరాల్లోకి వెళ్తే... తిరుపతిలోని అంబేద్కర్ నగర్ లో ఉంటున్న ఒక యువకుడు టిక్ టాక్ లో రాణిస్తున్న సమయంలో విశాఖకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ చనువుగా ఉన్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత టిక్ టాక్ లోనే కడపకు చెందిన మరో అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కూడా ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 


ఆ తర్వాత విశాఖకు చెందిన అమ్మాయి మళ్లీ తిరిగొచ్చింది. ప్రియుడికి పెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఆమె బాధపడింది. ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాత తాను కూడా ఇక్కడే ఉండిపోతానని, ముగ్గురం కలిసి ఉందామని ప్రియుడి భార్యతో చెప్పింది. ఈ మాట విన్న భార్య ముందు షాక్ తిన్నా.. తర్వాత ముగ్గురూ కలిసి ఉండేందుకు ఒప్పుకుంది. నిన్న దగ్గరుండి తానే తన భర్తకు, ఆయన ప్రియురాలికి పెళ్లి జరిపించింది. పెళ్లి కూతురుని కూడా ఆమె స్వయంగా అలంకరించింది. ఈ విషయం తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM