ఆ ప్రతిపాదనను...జగన్ అప్పుడే తిరస్కరించారు: సజ్జల

by సూర్య | Thu, Sep 22, 2022, 08:56 PM

వైసీపీ శాశ్వత అధ్యక్షుడి ప్రతిపాదనను వై.ఎస్.జగన్ నాడే తిరస్కరించారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరని తెలిపింది. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... పార్టీ జీవితకాల అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారని చెప్పారు. జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్ లోకి ఎక్కలేదని తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్ల వరకు జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని... ఆ తర్వాత పార్టీలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని అన్నారు. 


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM