ఏపీ రాష్ట్రంలో నవంబర్ నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల పై నిషేధం

by సూర్య | Thu, Sep 22, 2022, 08:50 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వారిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేయగా.. రాష్ట్ర అటవీ పర్యావరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతి, వినియోగం, ప్రింటింగ్, రవాణా, ప్రదర్శనపై నిషేధం విధించారు.నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీలకు రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉల్లంఘించిన వారిని పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులు కాటన్, నేత వస్త్రాలను  వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM