![]() |
![]() |
by సూర్య | Thu, Sep 22, 2022, 08:43 PM
ఏపీ పర్యాటక, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం విజయవాడలో కనకదుర్గమ్మ సేవలో ఆమె పాలుపంచుకున్నారు. దసరా శరన్నవ రాత్రుల ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం సహచర మంత్రులతో కలిసి దుర్గమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించిన రోజా... దుర్గా మాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా మాతకు రోజా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Latest News