కావాల్సింది వ్యవస్ధల రిపేరు: సీబీఐ మాజీ జే.డీ.లక్ష్మీనారాయణ

by సూర్య | Thu, Sep 22, 2022, 08:11 PM

పేరు మార్పు కాదు... వ్యవస్ధల రిపేరు కావాలంటూ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైనంపై సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి వి లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం దిగిపోయి... డీఎంకే ప్రభుత్వ పాలన అమలయ్యాక చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ ఆయన ఏపీ సర్కారు తీరును విమర్శించారు. 


మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ మాజీ సీఎం జయలలిత బొమ్మలతో ఉన్న స్కూల్ బ్యాగులను పంపిణీ చేసి, తన ఔన్నత్యాన్ని చాటారని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇక్కడి పాలకులు మారినపుడల్లా పేర్లు మార్చుకుంటూ నానా యాగీ చేస్తున్నామని ఆయన అన్నారు. అయినా పేరు మార్పు కాదు... వ్యవస్ధల రిపేరు కావాలంటూ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM