పేరు మార్పుపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

by సూర్య | Thu, Sep 22, 2022, 08:09 PM

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదిలావుంటే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్ ను కలిశారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. 


1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకొచ్చానని తెలిపారు. జగన్ మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ చీకటి జీవోను తీసుకొచ్చారని తెలిపారు. జగన్ వచ్చిన తర్వాతే ఆరోగ్య రంగం భ్రష్టుపట్టిందని చెప్పారు. జగన్ సీఎం అయిన తర్వాత మూడు మెడికల్ కాలేజీలకు గుర్తింపు మాత్రమే వచ్చిందని అన్నారు. రాత్రి వాళ్ల నాన్న ఆత్మతో మాట్లాడి యూనివర్శిటీ పేరును మార్చారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. వైఎస్సార్, జగన్ ఇద్దరూ కలిసి ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారో చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్ప వ్యక్తి అని చంద్రబాబు ప్రశ్నించారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM