ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పులో రాజకీయం లేదు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:20 PM

టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్ర‌శ్నించారు. విశాఖ‌లో ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిప‌డ్డారు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని ప్ర‌శ్నించారు. బీసీల తోకలు కట్‌ చేస్తానన్న వ్యక్తి చంద్రబా బు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింద‌ని మంత్రి కారుమూరి తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు రాజ్యసభ కు వెళ్లారో ప్రజలకు తెలుసు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రు లుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ అంటే వైయ‌స్‌ గుర్తుకు వస్తారు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టాము. తణుకులో బీసీ కమ్యూనిటీ హాలుకు జ్యోతి రావు పూలే పేరు పెడితే టీడీపీ హయాంలో ఆ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టా రు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు వైయ‌స్ కృషి చేశారు. అందుకే ఆయన పేరు పెట్టాలని ఎక్కువ మంది కోరార‌ని మంత్రి వివ‌రించారు.

Latest News

 
రెండో రోజు నాలుగు నామినేషన్లు Sat, Apr 20, 2024, 10:49 AM
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM