13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:18 PM

మూడు వేర్వేరు సంఘటనల్లో 13మంది ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు అరెస్టు చేసింది. వారి నుంచి 23ఎర్రచందనం దుంగలు, నాలుగు ఇనుప గొడ్డళ్లు, బజాజ్ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. టాస్క్ ఫోర్సు డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ మేడా సుందరరావు అధ్వర్యంలో, డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో రిజర్వు ఇనస్పెక్టరు (ఎఆర్) సురేష్ కుమార్ రెడ్డికి చెందిన టీమ్ లు బుధవారం నుంచి కూంబింగ్ చేపట్టాయని చెప్పారు.


ఒక టీమ్ బాకారాపేట ఘాట్, భీమవరం ఫారెస్టు ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా, చామల ఈస్ట్ బీట్ నాంచారమ్మ చెరువు దగ్గర గురువారం ఉదయం కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని చుట్టు ముట్టగా వారు దుంగలను పడేసి పారిపోయినట్లు తెలిపారు. అయితే తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ (38) అనే స్మగ్లర్ ను పట్టుకున్నట్లు చెప్పారు అక్కడ 9ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గురువారం తెల్లవారుజామున మరో టీమ్ బాలపల్లి రేంజ్ కంగిమడుగు వద్ద కూంబింగ్ చేస్తుండగా, వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దుంగలను పడేసి పారిపోయారన్నారు.


ఆ ప్రాంతంలో 14ఎర్రచందనం దుంగలు లభించాయి. మరొక టీమ్ శ్రీకాళహస్తి మండలం వల్లం సెక్షన్, మేల్చూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. అక్కడ ఆటో నుంచి వస్తూ టాస్క్ ఫోర్సు అధికారులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని తెలిపారు. వీరివద్ద ఇనుప గొడ్డళ్లు, అడవిలో ఉపయోగించుకునే వస్తువులు కలిగిన రెండు షోల్డర్ బ్యాగ్ లను స్వాధీనం చేసుకున్నారు.


వీరిని తొల్లేటి సుదర్శన్, యాకసిరి ప్రసాద్, ఎల్లంచెట్టి చెంచయ్య, కువ్వకుల మారయ్య, తుపాకుల హరికృష్ణ, పట్రా నాగరాజు, దొబ్బరం గోపి, తుపాకుల శ్రీను, మల్లెంపల్లి శివ, ఈగల వెంకటేష్, కువ్వకుల మురుగయ్య, బండి శ్రీనివాసులు కాగా వీరు శ్రీకాళహస్తి సమీపంలోని మండలాలకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. మూడు నేరాలకు సంబంధించి 13మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, 23ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం ఎర్రచందనం దుంగలు 454. 2కిలోలు ఉండగా, వీటి విలువు రూ. 50లక్షలని తెలిపారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM