చిత్తూరులో స్టాండింగ్ కమిటీ సమావేశం

by సూర్య | Thu, Sep 22, 2022, 04:16 PM

చిత్తూరు నగరపాలక స్టాండింగ్ కమిటీ సమావేశం నగర మేయర్ ఎస్. అముద అధ్యక్షుతన గురువారం జరిగింది. సమావేశంలో కమిషనర్ డా. జె అరుణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆర్. చంద్రశేఖర్, ఆర్. జి శ్రీకాంత్, బి. పూర్ణచంద్రరావు, సి. శోభ, ఎ. జి సహదేవున్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువలు, జిఐ పైపులు, నీటి ఫిల్టరేషన్ ప్లాంట్లో యంత్రాలు, రసాయనాల కొనుగోళ్లకు సంబంధించిన పనులకు, సాధారణ నిధులతో సిమెంట్ రోడ్లు, నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు కొనుగోలుకు కమిటీ సభ్యులు ఆమోదించారు.


ప్రధాన రహదారి నుండి శేషాపురం కు బిటీ రోడ్డు వేయడానికి కమిటీ ఆమోద ముద్ర వేసింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరాన్ని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవడానికి వీలుగా రుసుము నిర్ణయిస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. సమావేశంలో సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంఈ ధనలక్ష్మీ, ఏసీపీ రామకృష్ణుడు, డీఈలు రమణ, వెంకట ప్రసాద్, మేనేజర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, ఎంఈలు పాల్గొన్నారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM