డెంగ్యూ నియంత్రణకు పటిష్ట చర్యలు: కమిషనర్

by సూర్య | Thu, Sep 22, 2022, 04:15 PM

చిత్తూరు నగరంలో డెంగ్యూ జ్వరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ డా. జె అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ జ్వరాలపై కమిషనర్ గురువారం వార్డు ఆరోగ్య కార్యదర్శులు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు, ఆశా కార్యకర్తలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ డెంగ్యూ జ్వరాలు కేసులు నమోదైన వార్డు కార్యదర్శులతో సమీక్షించారు. జ్వరాలు వ్యాపించకుండా ముందస్తు నియంత్రణ చర్యలు ప్రతి వార్డుస్థాయిలో పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ఇంటింటి సర్వే నిర్వహించి దోమ లార్వాలను గుర్తించి నాశనం చేయాలన్నారు.


క్షేత్రస్థాయి పర్యటనలో దోమ లార్వా ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెక్టర్ కంట్రోల్ హైజిన్ యాప్ లో ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిష్కరించి అప్లోడ్ చేయాలన్నారు. యాప్ లో ఫిర్యాదులు పెండింగ్ లేకుండా క్రమం తప్పకుండా క్లియర్ చేయాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే కొనసాగించాలన్నారు. సమావేశంలో మేనేజర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, శానిటరీ ఇన్ స్పెక్టర్ చిన్నయ్య, ఎఎస్ఓ నరసింహ పాల్గొన్నారు.

Latest News

 
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM
మహిళలు ఆర్థికంగా ఎదగాలి Fri, Sep 30, 2022, 02:14 PM