![]() |
![]() |
by సూర్య | Thu, Sep 22, 2022, 04:04 PM
ఈ రోజు అమరావతిలోని సెక్రటేరియట్ లో కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ రావు ని మర్యాదపూర్వకంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కలిసి పలు అంశాలను ప్రస్తావించారు. అరకు వ్యాలీ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాప్ కొరత తదితర విషయాలపై క్లుప్తంగా వివరించి, త్వరితగతంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం చేపట్టాలని కోరారు. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు, టీచింగ్ స్టాప్ అండ్ నాన్ టీచింగ్ స్టాప్ కొరత తీర్చాలని కోరారు.
అదేవిధంగా ఈ కళాశాలకు ప్రహరీ గోడ లేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోందని కావున కళాశాల, విద్యార్థిని, విద్యార్థుల రక్షణ దృష్ట్యా ప్రాంగణానికి చుట్టూరా ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కమిషనర్ ని కోరారు. ఈ అంశాలపై కమిషనర్, సానుకూలంగా స్పందించారని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తెలిపారు.
Latest News