సీఎం భగవంత్ మాన్ కీలక ప్రకటన

by సూర్య | Thu, Sep 22, 2022, 04:00 PM

పంజాబ్ అసెంబ్లీ సమావేశాన్ని గవర్నర్ రద్దు చేయడంతో సీఎం భగవంత్ మాన్ గురువారం కీలక ప్రకటన చేశారు. వచ్చే మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 'గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీని ఈ నెల 27(మంగళవారం) నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం' అని పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో విద్యుత్, పంట వ్యర్థాల కాల్చివేత సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు.


గురువారం జరగాల్సిన ప్రత్యేక సమావేశాన్ని గవర్నర్ రద్దు చేయడంపై సుప్రీంకోర్టును కోరుతామని తెలిపారు. కాగా, బుధవారం పంజాబ్ గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ అకస్మాత్తుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని ఆప్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి అంతమొందించాలని చూస్తున్నారని కేజ్రీవాల్ వమర్శించారు. 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM