కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర

by సూర్య | Fri, Apr 26, 2024, 08:28 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. పగలు పది దాటిందంటే చాలు జనం ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ఇక వృద్ధులు, చిన్నారులను మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అవసరం కొద్దీ బయటకు వచ్చినప్పటికీ.. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగాలనీ.. వీలైతే ఓఆర్ఎస్ ద్రావణం లేదా నిమ్మరసం వంటివి తీసుకోవాలనేది వైద్యుల సలహా. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు నిమ్మకాయ ధరలకు రెక్కలు వస్తుంటాయి. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మకాయ ధరలు రికార్డు స్థాయికి చేరాయి.


పొదలకూరు మార్కెట్లో శుక్రవారం నాణ్యమైన నిమ్మకాయల బస్తా 9 వేల 500 రూపాయలు పలికిందని రైతులు చెప్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీ వరకూ 4 నుంచి ఐదువేల వరకూ ఉన్న నిమ్మకాయల బస్తా.. మంగళవారం 6 వేలకు చేరుకుంది. గురువారం నాటికి ఏకంగా 8 వేలు పలికింది. శుక్రవారం మరో1500 పెరిగి 9 వేల 500 పలికినట్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. పెరుగుతున్న ఎండల కారణంగా ఉత్తరాది రాష్ట్రాలలో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగినట్లు చెప్తున్నారు. వేసవి సీజన్‌కు సంబంధించి మే నెల ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో నిమ్మకాయ రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


నిమ్మకాయల ఉత్పత్తిలో ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందువరుసలో ఉంటాయి. ఇక్కడ పండించే నిమ్మకాయలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. గతేడాది వేసవి కాలంలోనూ ఇలాగే నిమ్మధర కొండెక్కి కూర్చుంది. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మార్కెట్లో నిమ్మకు డిమాండ్ పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM