స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే

by సూర్య | Fri, Apr 26, 2024, 06:46 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు. అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్డర్ తాను తీసుకొచ్చానని కేఏ పాల్ మరోసారి గుర్తుచేశారు. అయితే క్రెడిట్ మరొకరికి ఇస్తున్నారని మండిపడ్డారు. తనకు క్రెడిట్ దక్కకపోవడానికి కారణం మీ కులంలో పుట్టకపోవడమేనా..? అని అడిగారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని కేఏ పాల్ కోరారు. లేదంటే స్టీల్ ప్లాంట్ భూములను అమ్ముకుంటారని మండిపడ్డారు. విశాఖ బరిలో తాను నిలవడంతో తన పార్టీ గుర్తు రద్దుచేశారని వివరించారు. హెలికాప్టర్ గుర్తు స్థానంలో కుండ తీసుకొచ్చారని వివరించారు.

Latest News

 
అవినాష్‌ గెలిస్తే నేరం గెలిచినట్లే: షర్మిల Wed, May 08, 2024, 11:40 AM
విద్యుత్ షాక్ తో రైతు గొల్ల మనోహర్ మృతి Wed, May 08, 2024, 11:33 AM
నేటి పంచాంగం 08-05-2024 Wed, May 08, 2024, 10:43 AM
జగన్ను గెలిపించండి: లక్ష్మీ భార్గవి Wed, May 08, 2024, 10:39 AM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 10:39 AM