గుడివాడలో గెలుపెవరిది?

by సూర్య | Fri, Apr 26, 2024, 06:44 PM

అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయం అంతా గుడివాడ చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ. టీడీపీ ఆవిర్భావం నుంచి ఏడుసార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసి గుడివాడ పేరును రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేసింది. పచ్చని పొలాలు, చెరువు గట్టులతోపాటు శుభకార్యాలకు నెలవులైన కల్యాణమండపాలు అందంగా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మళ్లీ టీడీపీ, వైసీపీ తలబడుతున్నాయి. భారతదేశంలో రెండోది, దక్షిణ భారతదేశంలోనే మొదటి హోమియో కాలేజీ గుడివాడలో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే హోమియో రీసెర్చ్‌ సెంటర్‌ ఉంది. వ్యవసాయ పరికరాల తయారీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గుడివాడ అగ్రగామి. ఇంత చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదో చూడాలి అంటే జూన్ 4వరకు ఆగాల్సిందే. 

Latest News

 
వందమంది ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసారు Wed, May 08, 2024, 08:09 PM
మా కుటుంబంలో చంద్రబాబు నిప్పుపెట్టాడు Wed, May 08, 2024, 08:08 PM
మార్కాపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను Wed, May 08, 2024, 08:08 PM
ఎమ్మెల్యే భార్యపై టీడీపీనేతల దాడి Wed, May 08, 2024, 08:07 PM
చంద్రబాబుకు తెలిసింది ఓటుకు నోటు పంచడమే Wed, May 08, 2024, 08:05 PM