చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు

by సూర్య | Fri, Apr 26, 2024, 06:12 PM

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర రాష్ట్ర‌వ్యాప్తంగా  జైత్ర‌యాత్ర‌గా సాగింద‌ని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.....  58 నెలలు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  సుపరి పాలన జరిగింది. మా పాలనలో ఎక్కడ అవినీతి లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచింది. ఇడుపుల పాయ నుండి ఇచ్చాపురం వరకు వైయ‌స్ జగన్ కి ప్రజలు బ్రాహ్మరధం పట్టారు .  వైయ‌స్ జగన్ పాలన చూసి ఓర్చుకోలేక చంద్రబాబు,పవన్ ఆరోపణలు చేస్తున్నారు. రాష్టంలో మళ్ళీ వైయ‌స్ జగనే సీఎం అవ్వాలని పేదలందరూ భావిస్తున్నారు.రాష్ట్రంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  మీద టీడీపీ నాయకుల దాడులు జరుగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం మాకు రెండుకళ్లు. ముఖ్యంగా పేదల అభివృద్ధి మాకు ముఖ్యం. రాష్టంలో ఎక్కడకి వెళ్లినా ప్రజలు ఆనందంగా ఉన్నారు. జగన్ గారికి బ్రహ్మరధం పడుతున్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  భారీ మెజారిటీతో మళ్ళీ  గెలవబోతుంది. ప్రజావిశ్వాసం లేని లోకేష్ మంగళగిరిలో గెలిచే పరిస్దితి లేదు. చంద్రబాబు వైయస్ జగన్ గారి చేస్తున్న విమర్శలు ఆపాలి. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పధకాలను ప్రజలు నమ్మడం లేదు. అందుకే వాటి ప్రచారం మరిచి జగన్ గారిపై దూషణలు,అనుచిత వ్యాఖ్యలు,వ్యక్తిగతంగా కించపరచడం చేస్తున్నారు. వైయస్ జగన్ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల సమస్యలను పధకాల అమలు చేయడం ద్వారా తీర్చారు. పార్టీ మేనిఫెస్టోను తూచతప్పకుండా అమలు చేశారు. అందుకే ప్రజలు విశ్వసనీయత,నమ్మకానికి ప్రతీకగా జగన్ గారిని ప్రతీకగా భావిస్తున్నారు. తెలుగుదేశం కూటమి గెలవదనే ప్రస్టేషన్ లో చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ లు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు.  ఆ కూటమికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయం అని ధీమా వ్యక్తపరిచారు. 

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM