అదృశ్యం కేసుని ఛేదించిన పోలీసులు

by సూర్య | Fri, Apr 26, 2024, 03:19 PM

తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసులో జగ్గయ్యపేట పోలీసులు ముందడుగు వేశారు. గురువారం జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండల పరిధిలో ఒక కర్మాగారం గోడ పక్కన నిలిపిన కారును గుర్తించారు. ఎల్లయ్య ఈ నెల 18న ఒక కేసులో మధ్య వర్తిత్వానికి అపర్ణ అనే మహిళతో టీఎస్‌.29 బి 9495 నెంబరు కారులో జగ్గయ్యపేట రావటం, డబ్బులిస్తానని శ్రీనివాస్‌ అనేవ్యక్తి కారులో తీసుకెళ్లటం, ఆ తర్వాత అపర్ణ కూడా అదృశ్యం కావటం, ఎల్లయ్యతో వచ్చిన స్నేహితుడు అంజయ్య కుటుంబ సభ్యులకు తెలియజేయటంతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీసులు నిందితుల కోసం తొమ్మిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా గురువారం కర్మాగారం సమీపంలో కారు ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావటంతో వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితం అదృశ్యం కాగా కారు ఇప్పుడు వెలుగులోకి రావటం, తాజాగా కారు ఇప్పుడే ఉంచారా? లేదా అప్పటి నుంచి హైవేపై ఉంటే ఎందుకు పోలీసులు గమనించ లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే కేసు మిస్టరిని ఛేదిస్తామని జగ్గయ్యపేట పోలీసులు చెబుతున్నారు. కారు సూర్యాపేటకు చెందిన కలప వ్యాపారిదిగా చెబుతున్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM