ఎన్డీఏతో వైసీపీ అంటకాగుతుంది

by సూర్య | Fri, Apr 26, 2024, 03:16 PM

మే 1వ తేదీన ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్  చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయని అందుచేత ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ వల్ల వృద్ధులు నానా ఇబ్బందులు ఎదుర్కొని, మరణాలు సంభవించటం విచారకరమన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న సచివాలయ, రెవిన్యూ సిబ్బందిలతో మే 1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయించాలన్నారు. సిబ్బంది, నగదు కొరత అనే సాకులు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే తగు చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కాగా ఎన్డీఏతోనే వైసీపీ కాపురమంటూ మనసులో మర్మాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం  జరుగుతున్నా పట్టించుకోని జగన్‌కు ఇవాళ ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న విషయం తెలియదనటం సీఎం పదవికే అవమానమన్నారు. జగన్, చంద్రబాబు.. బీజేపీ తానులో ముక్కలేనని.. వైసీపీ, టీడీపీలలో ఎవరిని గెలిపించినా బీజేపీ కుంపటి ప్రజల నెత్తిన పెట్టడం ఖాయమని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM