పోస్టల్‌ బ్యాలెట్‌ పై అవగాహన సదస్సులు

by సూర్య | Thu, Apr 25, 2024, 06:37 PM

 పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకోవ డంపై విజయవాడ వేదికగా ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలు విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. ప్రధాన జేఏసీలకు నాయకత్వం వహిస్తున్న ఏపీఎన్‌ జీజీవో అసోసియేషన్‌, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీఆర్‌ఎస్‌ఏ)లు సమావేశాలు పెట్టి ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. సీపీఎస్‌ ఉద్యో గుల సంఘం కూడా తమ ఉద్యోగులకు అవగాహన కల్పిస్తోంది. ఏపీఎన్‌జీజీవో అసోసియేషన్‌ తరఫున కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్‌, ఏపీఆర్‌ఎస్‌ఏ తరఫున బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావులు ఉద్యోగులను పోస్టల్‌ బ్యాలెట్‌ వేయడంపై కార్యోన్ము ఖులను చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సంఘ సభ్యులతో ఏపీఎన్జీవో ఓభవన్‌, ఏపీ రెవెన్యూ భవన్‌లో సమావేశాలు నిర్వహించి ఎన్నికల విధుల్లో పాలు పంచుకునే ఉద్యోగులంతా నూరుశాతం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే దిశగా కసర త్తులు చేస్తున్నాయి. ‘‘ఫాం-12డీలను రిటర్నింగ్‌ అధికారులకు ఇవ్వడంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం సంఘాల దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కొందరి ఉద్యోగులను నియమించాం. సమస్య తేలకపోతే కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. ఉద్యో గులకు గతంలో మాదిరిగా ముందస్తుగా ఈ దఫా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వరు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రానికి వెళ్లినపుడు మాత్రమే ఇస్తారు.’’ అని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM